ఎక్సైజ్‌ దాడులు : నలుగురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-11-28T05:07:45+05:30 IST

తీర ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎక్సైజ్‌ దాడుల్లో నలుగురిని అరెస్టు చేశామని ఎక్సైజ్‌ సీఐ లక్ష్మి తులసీ తెలిపారు.

ఎక్సైజ్‌ దాడులు : నలుగురి అరెస్ట్‌

నరసాపురం, నవంబరు 27: తీర ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎక్సైజ్‌ దాడుల్లో నలుగురిని అరెస్టు చేశామని ఎక్సైజ్‌ సీఐ లక్ష్మి తులసీ తెలిపారు. పేరుపాలెం, కేపీపాలెం, రామన్నపాలెం గ్రామాల్లో శుక్రవారం దాడులు నిర్వహించి 11 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు హాజరుపరిచామన్నారు.

Read more