మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-27T05:11:52+05:30 IST
తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి వంద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ అజయ్ కుమార్‌సింగ్ తెలిపారు.

బుట్టాయగూడెం, నవంబరు 26:తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి వంద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ అజయ్ కుమార్‌సింగ్ తెలిపారు. పందిరిమామిడిగూడెం సెంటరులో వాహనాలను తని ఖీ చేస్తుండగా దొరమామిడికి చెందిన గెడ్డం రవి, తెలంగాణ రాష్ట్ర కన్నాయగూ డెంకు చెందిన కుంజా వెంకటేశ్వరావు రెండు ద్విచక్ర వాహనాలపై బాటిళ్ళను తరలిస్తుండగా గురువారం పట్టుకున్నామన్నారు. వారిని రిమాండ్ నిమిత్తం కో ర్టుకు హాజరు పరిచామన్నారు. తనిఖీలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చింతలపూడి సర్కిల్ పరిధిలో ఇద్దరు..
చింతలపూడి, నవంబరు 26 : చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సారా కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామని సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.సుధ తెలిపారు. వారి నుంచి 37 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. కృష్ణాపురం, తెడ్లం, పుప్పాలవారిగూడెం గ్రామాల్లో దాడులు జరిపామన్నారు.
పోలవరంలో ఒకరి అరెస్ట్
పోలవరం, నవంబరు 26 : దేవరగొండి పునరావాస కాలనీలో దాడులు నిర్వహించి సారా విక్రయిస్తున్న పసగత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అరెస్టు చేసి 25 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి జంగారెడ్డిగూడెం కోర్టుకు తరలించామన్నారు.