-
-
Home » Andhra Pradesh » West Godavari » Crime
-
ఎక్సైజ్ దాడులు : ముగ్గురిపై కేసులు
ABN , First Publish Date - 2020-11-26T05:07:49+05:30 IST
చింతలపూడి ఎస్‌ఈబీ అధికారులు సర్కిల్ పరిధిలో దాడులు నిర్వహించి రెండు కేసుల్లో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఈబీ సీఐ డి.సుధ తెలిపారు.

చింతలపూడి/టి.నరసాపురం, నవంబరు 25 : చింతలపూడి ఎస్‌ఈబీ అధికారులు సర్కిల్ పరిధిలో దాడులు నిర్వహించి రెండు కేసుల్లో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఈబీ సీఐ డి.సుధ తెలిపారు. సర్కిల్ లోని టి.నరసాపురం మండలం వెలగపాడు, బండివారిగూడెం గ్రామాల్లో దాడు లు నిర్వహించి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. ఓ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడుల్లో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీను, లోకేశ్, సుధాకర్ పాల్గొన్నారు.