-
-
Home » Andhra Pradesh » West Godavari » crime
-
ఇసుక అక్రమ నిల్వపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-11-22T05:12:26+05:30 IST
అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు.

టి.నరసాపురం, నవంబరు 21 : అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు. మక్కినవారిగూ డెం పంచాయతీ గౌరీశంకరపురం గ్రామానికి చెందిన కోడెల్ల గిరిబాబు చింతల వాగు నుంచి అనుమతులు లేకుండా పది ట్రక్కుల ఇసుకను తెచ్చి నిల్వ చేశారు. వీఆర్వో జెల్లా శుభాష్‌చంద్రబోస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.