చెట్టును ఢీకొన్న లారీ : డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2020-11-22T05:05:14+05:30 IST

కామవరపుకోట–తడికలపూడి ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారుజామున చెట్టును లారీ ఢీ కొన్న ఘటనలో లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

చెట్టును ఢీకొన్న లారీ : డ్రైవర్‌ మృతి

కామవరపుకోట, నవంబరు 21 : కామవరపుకోట–తడికలపూడి ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారుజామున చెట్టును లారీ ఢీ కొన్న ఘటనలో లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తడికలపూడి ఏఎస్‌ఐ ఎన్‌.వి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు నుంచి కామవరపుకోట వైపు సుద్ధ లోడుతో లారీ వెళ్తుండగా తడికలపూడి సమీపంలో లారీ అదుపు తప్పి కుడి వైపున ఉన్న చెట్టును ఢీ కొంది. సత్తుపల్లి మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ రేపాని వెంకటేశ్వరరావు(34) మృతి చెందాడు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read more