ఇసుక నిల్వ చేసిన ఇద్దరిపై కేసు

ABN , First Publish Date - 2020-11-08T05:01:02+05:30 IST

ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు.

ఇసుక నిల్వ చేసిన ఇద్దరిపై కేసు

టి.నరసాపురం, నవంబరు 7:ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కె.రామకృష్ణ  తెలిపారు. తిరుమలదేవీపేట పంచాయతీ మల్లప్పగూడెంలో ఎటువంటి అనుమతులు లేకుండా 19 ట్రక్కుల ఇసుక నిల్వ చేసినట్టు సమాచారంతో శనివారం దాడి చేసి ఇసుకను స్వాధీన పర్చుకున్నామన్నారు. వీఆర్వో జి.ఫణీంద్రకుమార్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-11-08T05:01:02+05:30 IST