3,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-11-08T05:00:16+05:30 IST

కొవ్వూరు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో శనివారం దాడులు నిర్వహించి 3,600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 150 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్‌ సీఐ టి. శ్రీనివాసరావు తెలిపారు.

3,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

కొవ్వూరు, నవంబరు 7:  కొవ్వూరు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో  శనివారం దాడులు నిర్వహించి 3,600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 150 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్‌ సీఐ టి. శ్రీనివాసరావు తెలిపారు. దేవరపల్లి మండలం త్యాజంపూడిలో ఏలూరు సీఐ ధనరాజు, కొవ్వూరు ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించి మండపాటి భీమరాజు, జలీం కల్యాణ్‌బాబును అరెస్టు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి గంజి నాని, యాదాల దిలీప్‌, పెంటపాటి బాలకృష్ణ, ఉప్పల రమేశ్‌ను అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. 


కంచెరగూడెంలో 800 లీటర్లు..

చింతలపూడి, నవంబరు 7 : చింతలపూడి మండలం కంచెరగూడెం గ్రామంలో అడవిలో దాచి ఉంచిన 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని ఎక్సైజ్‌ సీఐ  డి.సుధ శనివారం తెలిపారు.

Updated Date - 2020-11-08T05:00:16+05:30 IST