లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-07T04:48:53+05:30 IST

జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు.

లారీ ఢీకొని ఒకరి మృతి

ఉంగుటూరు,నవంబరు 6 : జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం. నాచుగుంట వద్ద యర్రమళ్లకు చెందిన టేకి దానయ్య(59) రోడ్డు దాటుతుండగా ఏలూరు నుంచి ఒడిస్సా వెళు తున్న అరటి గెలల లోడు లారీ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఐ.వీర్రాజు తెలిపారు.

Updated Date - 2020-11-07T04:48:53+05:30 IST