-
-
Home » Andhra Pradesh » West Godavari » cpm cpi Congress nirasana
-
వ్యవసాయ బిల్లులు రద్దు చేయాల్సిందే..
ABN , First Publish Date - 2020-12-06T05:44:13+05:30 IST
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాల్సిందేనని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఆర్టీ నాయకులు డిమాండ్ చేశారు.

పలు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు
తణుకు టౌన్, డిసెంబరు 5 : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాల్సిందేనని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఆర్టీ నాయకులు డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా స్థానిక వెంకటేశ్వర సెంటర్ వద్ద మోదీ, అంబాని, అధాని దిష్టి బొమ్మలను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా, కార్పొరేట్ల పాలిట వరంగా ఉన్నాయన్నారు. సీపీఎం మండల కార్యదర్శి పి.వి.ప్రతాప్, బీ ఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేశ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు, కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి దిర్శిపో రామకృష్ణ, సీపీఎం జిల్లా నా యకులు అడ్డగర్ల అజయకుమారి, గార రంగారావు, కామన మునిస్వామి పాల్గొన్నారు.