విభజన హామీలు అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-11-04T04:30:46+05:30 IST

రాష్ట్ర విభజన హామీలు అమలుచేయాలని, రైల్వేజోన్‌, రాష్ట్రాల హక్కులను హరించవద్దని సీపీఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు.

విభజన హామీలు అమలు చేయాలి

వీరవాసరం, నవంబరు 3: రాష్ట్ర విభజన హామీలు అమలుచేయాలని, రైల్వేజోన్‌, రాష్ట్రాల హక్కులను హరించవద్దని సీపీఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు. బీజేపీతో వైసీపీ, టీడీపీ రాజీ ఎందుకు అనే బుక్‌లెట్‌ను సీపీఎం నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. 2014 రాష్ట్ర విభజన సందర్బంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పింని, అధికారం లోకి వచ్చి పది సంవత్సరాలు ప్రత్యేకహోదా ప్రకటిస్తామని ఆ మాటను విస్మరించారని విమర్శించారు. దీనిపై టీడీపీ, అధికారంలో ఉన్న వైసీపీ ఏమీ మాటలాడకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు జుత్తిగ నిర్సంహమూర్తి, రెడ్డి రామారావు, పోతుల మృత్యుంజయ, యండమూరి సుబ్బారావు, కేతా జ్యోతిబసు, పాలా అజయ్‌ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-04T04:30:46+05:30 IST