కొందరికే కొవిడ్‌ పరీక్షలు!

ABN , First Publish Date - 2020-11-01T05:07:22+05:30 IST

covid testపాఠశాలలకు వెళ్లనున్న 9, 10 తరగతుల విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొందరికే  కొవిడ్‌ పరీక్షలు!

వీరవాసరం అక్టోబరు 31: పాఠశాలలకు వెళ్లనున్న 9, 10 తరగతుల విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానుండడంతో 9,10 తరగతుల విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు ప్రారంభం కాలేదు. అండలూరు, కొణితివాడ, తోలేరు, రాయకుదురు, వీరవాసరం, మత్స్యపురి జడ్పీ హైస్కూల్‌ విద్యార్ధులకు మాత్రమే పరీక్షలు చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఇంతవరకూ కొవిడ్‌ పరీక్షలు చేయకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా సంస్థ ల యాజమాన్యం కూడా అయోమయంలో పడ్డాయి. పిల్లలను పాఠశాలలకు  పంపాలా, వద్దా అని తల్లిదండ్రులు సంశయంలో ఉన్నారు.

Read more