కరోనా.. అటెన్షన్!
ABN , First Publish Date - 2020-04-05T10:51:12+05:30 IST
కరోనా వైరస్ విస్తృతం అవ్వకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆందోళన చెందవద్దని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు.

అధికార యంత్రాంగం అప్రమత్తం
వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక
ప్రతీ రోజూ టెన్షన్.. టెన్షన్.. అసలేం జరుగుతోంది.. ఏం చేస్తున్నారు.. ఏం చేయాలి.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అధికారుల నిత్యం సమీక్షలు.. కరోనా అనే మాట వింటేనే ఉలిక్కిపడుతున్నారు.. ఎక్కడ నుంచి ఎలా వస్తుందోనని జనం భయపడుతుంటే.. ఎలాగైనా అడ్డుకోవాలని అధికార యంత్రాంగం కాచుకుని కూర్చుంది.. పాజిటివ్ అనే మాట వినిపిస్తే చాలు రెడ్ అలర్ట్ ప్రకటిస్తోంది.. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మరింత పెరగకుండా అడ్డుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఒక పక్క బెడ్లు.. మరో పక్క ప్రైవేటు వైద్యులను సన్నద్ధం చేసే పనిలో పడ్డారు. అత్యవసర చర్యలకు ఉపక్రమిస్తున్నారు..
ఆందోళన చెందవద్దు : మంత్రి నాని
ఏలూరు ఫైర్‌స్టేషన్, ఏప్రిల్ 4 :కరోనా వైరస్ విస్తృతం అవ్వకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆందోళన చెందవద్దని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు.నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం కరోనా వైరస్‌పై సమీక్షి ంచారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుం టు న్నామన్నారు.ఏప్రిల్ 14వ తేదీ వరకూ ప్రజలు సహకరిస్తే కరోనా మహమ్మా రిని పారద్రోలతామనే నమ్మ కం ఉందన్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సమయ ంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకూ 180 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.
జిల్లాలో 15 కేసులు పాజిటివ్ ఉన్నాయన్నారు.వీరంతా కూడా ఢిల్లీలో నిజాముద్దీన్ వెళ్లి వచ్చినవారేనన్నారు.వీరిని ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచా మన్నారు.వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా కొవిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించా మన్నారు.వీరి శాంపిల్స్ లెబోరేటరీలకు పంపామన్నారు.ఆదివారం మాంసం దుకాణాలు మూసివేసే విధంగా, డీ సెంట్రలైజేషన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.హోం క్వారంటైన్ సెంటర్లలో వైద్య, మౌలిక సదుపాయాలతో పాటు,నాణ్యమైన భోజన వసతి కల్పిస్తున్నామన్నారు.