-
-
Home » Andhra Pradesh » West Godavari » Corona Positive Cases Near Thousand
-
వెయ్యికి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-06-23T10:55:33+05:30 IST
జిల్లాలో పాజిటివ్ కేసులు ఎడతెరపి లేకుండా నమోదవు తూనే ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ సంఖ్య వేయి ..

34 మందికి పాజిటివ్.. 849కి చేరిన కేసులు
రోగులతో కిక్కిరిస్తున్న వార్డులు.. ప్రత్యామ్నాయం వైపు ప్రభుత్వం దృష్టి
ఏలూరు, జూన్ 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో పాజిటివ్ కేసులు ఎడతెరపి లేకుండా నమోదవు తూనే ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ సంఖ్య వేయి మైలురాయిని దాటే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా వరుస కేసులను గుర్తించడం, ఆ వెంట నే ఐసొలేషన్ వార్డుకు తరలిస్తుండడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో వార్డు పాజిటివ్ రోగులతో కిక్కిరి స్తోంది. 750 పడకల సామర్ధ్యం కలిగిన ఐసొలేషన్‌లో వరుస కేసులతో ఒత్తిడి పెరగడంతో కేర్ సెంటర్లను ఏ ర్పాటు చేస్తున్నారు. రిస్క్ తక్కువగా వున్న రోగులందరినీ ఆయా సెంటర్లకు తరలించనున్నారు.
ఇప్పటికే ఏలూరు సీఆర్ రెడ్డి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి 60 మందిని, పాలిటెక్నికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన విభాగానికి మరో 50 మందిని సోమవారం తరలించారు. ప్రత్యేకించి ఐసొలేషన్ వార్డులోనే ఉంచి చికి త్స చేయదలిచిన వారందరినీ యధావిధిగానే కొనసాగిస్తారు. వచ్చే నెల వరకూ వైరస్ ఉధృతి ఇదే రూపంలో కొనసాగే అవకాశం ఉంటుందని ఒక అంచనా. ఇప్పటి వరకు కొనసాగిన క్వారంటైన్‌లను ఇకపై క్లినిక్‌లుగా మార్చేస్తున్నారు. అదే ప్రాంతంలో వైద్యులను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతారు.
తాజాగా 34 కేసులు
జిల్లాలో సోమవారం 34 కేసులు నమోదైతే ఇందులో ఒక్క ఏలూరులోనే 25 ఉన్నాయి. నగరంలోని గొర్రెలవారివీధి, సబ్బులవారివీధి, రాణీగారితోట, మంచి నీళ్లతోట, పెద్దింటి వారి వీధి, తూర్పు వీధి, మోతేవారితోట, జేపీ కాలనీ, కొబ్బరి తోట, దక్షిణపు వీధుల్లో 25 కేసులను నిర్ధారించారు. మొగల్తూరు కేపీ పాలెంలో కొత్తగా ఐదు, దగ్గులూరు ఒకటి, పెద అమిరం ఒకటి, నరసాపురం ఒకటి చొప్పు న నమోదయ్యాయి. ఈ కేసులన్నింటితో కలిపి మొత్తం 849కి సంఖ్య పెరిగింది.
కరోనాతో వృద్ధుడి మృతి
భీమవరం క్రైం : పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు(60) కరోనాతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో మృతి చెందడంతో కలకలం రేగింది. ఈ నెల 20న జ్వరంతో బాధపడుతున్న అతనిని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. వైద్యులు కొవిడ్ పరీక్షకు సూచించడంతో అదేరోజు ప్రభుత్వాసుపత్రిలో పరీక్ష చేశారు. సాయంత్రానికి పాజిటివ్‌గా తేలడంతో ఏలూరు ఆశ్రంకు తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని భీమవరం కరోనా నోడల్ అధికారి శివరంజని తెలిపారు. జిల్లాలో ఇది తొలి కరోనా మరణంగా అధికారులు చెబుతున్నారు.