నెల రోజుల్లో 12 వేల కేసులు.. పశ్చిమ గోదావరి జిల్లా కరోనా లెక్కలివీ..!

ABN , First Publish Date - 2020-08-01T21:26:09+05:30 IST

కరోనా వైరస్‌ జూలై నెలలో పెను విధ్వం సాన్నే సృష్టించింది. మార్చి 31న 14 పాజిటివ్‌ కేసులతో జిల్లాలో పాదాన్ని మోపిన కొవిడ్‌ వరుసగా మూడు నెలల పాటు ఏప్రిల్‌, మే, జూన్‌లలో 1400 కేసులకే పరిమితం కాగా,

నెల రోజుల్లో 12 వేల కేసులు.. పశ్చిమ గోదావరి జిల్లా కరోనా లెక్కలివీ..!

ఏలూరు అర్బన్‌: కరోనా వైరస్‌ జూలై నెలలో పెను విధ్వం సాన్నే సృష్టించింది. మార్చి 31న 14 పాజిటివ్‌ కేసులతో జిల్లాలో పాదాన్ని మోపిన కొవిడ్‌ వరుసగా మూడు నెలల పాటు ఏప్రిల్‌, మే, జూన్‌లలో 1400 కేసులకే పరిమితం కాగా, ఒక్క జూలై నెలలోనే 12,005 మంది (1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ)కి సోకింది.మరీ ముఖ్యంగా సంజీవని సంచార వాహ నాలను జిల్లా నలుమూలలకు పంపించి వైరస్‌ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసిన నేపథ్యంలో జూలై 18 నుంచి 31వ తేదీ మధ్య కాలానికి 14 రోజులకు రికార్డు స్థాయిలో 10,005 కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లాలో కరోనా వేగాన్ని పుంజుకోగా ఆగస్టులో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. 


టాప్‌ టెన్‌లో కరోనా ఇలా..

ఏలూరు అర్బన్‌లో 87, రూరల్‌లో 77 కంటైన్మెంట్‌ క్లస్టర్లతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్‌ నిర్దారణ కేసుల్లో దాదాపు ఆరు వేల కేసులు ఒక్క ఏలూరు నగరం పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. తదుపరి స్థానాల్లో భీమవరం, నరసాపురంలలో చెరో వెయ్యికిపైగా, ఆ తదుపరి తాడేపల్లిగూడెం, యలమంచిలి, పాలకొల్లు, తణుకు, పెదపాడు, మొగల్తూరు, పోడూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూ డెం, నల్లజర్ల, టి.నరసాపురం తదితర పట్టణాలు, మండలాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలైన పోలవరం, వేలేరుపాడు వంటిచోట్ల కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్త ప్రాంతాలను సైతం కరోనా తాకుతుండడంతో శుక్రవారానికి జిల్లాలో మొత్తం కంటైన్మెంట్ల సంఖ్య 908కి పెరిగింది.


పాజిటివ్‌ వస్తే ఎనిమిది గంటల్లోగా ఆసుపత్రికి..

కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన  తరువాత గరిష్టంగా ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా కొవిడ్‌ ఆసు పత్రి లేదా కేర్‌ సెంటర్‌లో చేర్చాల్సిందిగా ప్రభుత్వం శుక్రవారం ఆదే శాలు జారీచేసింది. ఈ మేరకు ఇన్‌స్టెంట్‌ ఆర్డర్‌-71  మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. పాజిటివ్‌ ఫలితం తేలిన వెంటనే చేపట్టాల్సిన చర్యలపై స్పష్టత ఇచ్చింది.పాజిటివ్‌ నిర్ధారణ అయిన బాధితుడి వద్దకు వెంటనే సంబంధిత ప్రాంత పీహెచ్‌సీ వైద్యాధికారి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించి హోం ఐసొలేషన్‌ సరిపోతుందా లేక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించాలా అనే విషయాన్ని నిర్ధారి స్తారు. తీవ్ర లక్షణాల్లేకుండా హోం ఐసోలేషన్‌లోనే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండేలా బాధితుడి ఆరోగ్య లక్షణాలు ఉంటే, ఆ ఇంటిలో ఇన్‌స్టెంట్‌ ఆర్డర్‌ 59 నిబంధనల ప్రకారం పరిస్థితులకు అనుగుణంగా అనుమతిస్తారు. ఇలా హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించాల్సిన బాధ్యత వైద్యాధికారులదే. ఈ నేపథ్యం లో పాజిటివ్‌ నిర్ధారణ అయిన తరువాత బాధితులను కొవిడ్‌ ఆసుపత్రులకు లేదా కేర్‌ సెంటర్లకు తరలించడం, హోం ఐసోలేషన్‌ వంటివి పర్యవేక్షించేం దుకు, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ సమన్వయ పరిచే నిమిత్తం ప్రతి రెవెన్యూ డివిజన్‌కు జిల్లా స్థాయి సీనియర్‌ అధికారు లను నియమి స్తున్నారు. కాగా రాష్ట్రస్థాయి సమన్వయ అధికారిణిగా జిల్లాకు డాక్టర్‌ ఉమాదేవిని ప్రభుత్వం శుక్రవారం నియమించింది


ఒక్క రోజే 727 పాజిటివ్‌

జిల్లాలో కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు.శుక్రవారం 727 కేసులు నమోదయ్యాయి. వీటిలో 107 ఏలూరు నగరంలో, రూరల్‌ మండలంలో 40 కేసులు నమోదయ్యాయి. జంగారెడ్డిగూడెంలోనూ కేసులు పెరిగాయి. మండలం లో 61 కేసులు నమోదు కాగా వాటిలో 38 జంగారెడ్డి గూడెం పట్టణం లోనే నమోదయ్యాయి.తాడేపల్లిగూడెం మండలంలో 48 కేసులు నమోదు కాగా ఎక్కువ పట్టణంలోనే ఉన్నాయి. తణుకు, పాలకొల్లు, భీమవరం,నరసాపురం పట్టణాల్లో 25కు పైగా కేసులు నమోదయ్యాయి. నిడదవోలులో పది లోపే కేసులు నమోద య్యాయి. భీమడోలు, వేలేరు పాడు మండలాల్లో కరోనా విజృంభిస్తోంది. వేలేరుపాడుతో పాటు మండలంలోని కోయిదాలో 16 కేసులు నమోద య్యాయి.పెదపాడులో పదికి పైగా కేసులు నమోదు కాగా మండల ంలోని వట్లూరులో ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి. కొవ్వూరు మండలంలో 20 కేసులు, బుట్టాయగూడెం, ద్వారకాతిరుమల, దెందు లూరు,పెదవేగి, అత్తిలి,మొగల్తూరు, పాలకోడేరు, నల్లజర్ల మండ లాల్లో కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.పెరవలి, గణప వరం,యలమంచిలి, పోలవరం, పెనుగొండ,పెంటపాడు,ఆచంట, చాగల్లు,చింతలపూడి మండలాల్లో ఐదు కంటే తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు జిల్లాలో నమోదయిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,247కు చేరింది. కరోనాతో శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. 

Updated Date - 2020-08-01T21:26:09+05:30 IST