-
-
Home » Andhra Pradesh » West Godavari » Corona cases increasing day by day
-
ఒక్కరోజే 54 మందికి సోకిన కరోనా
ABN , First Publish Date - 2020-06-22T11:17:41+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరుసగా కార్మికులకు, ఉద్యోగులకు, సాధారణ

వైరస్ విస్తరణ
నియంత్రణకు నేటి నుంచి ఏడు ప్రాంతాల్లో లాక్‌డౌన్
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
లాక్‌డౌన్ ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది వరకే దుకాణాలకు అనుమతి
ఏలూరు, జూన్ 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరుసగా కార్మికులకు, ఉద్యోగులకు, సాధారణ కుటుంబీకుల కు వైరస్ సంక్రమిస్తోంది. వైరస్ లక్షణాలు బయట పడకుం డానే పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణవుతోంది. వారం రోజులుగా పెద్దసంఖ్యలో కేసులు బయట పడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. కేసులు వరుసగా నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించేందుకు నిర్ణయించారు.
పరిస్థితిని ఏరోజుకా రోజు బేరీజు వేసి కేసులతో సరిపోల్చుకుని ఆయా ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించారు. తొలి దశ లాక్‌డౌన్ ఏ రూపంలో అమలుచేశారో తాజాగా అవే నిబంధనలు పునరా వృతం కానున్నాయి. ఏలూరు నగరంలో సోమవారం నుంచి వన్‌టౌన్ ప్రాంతం లాక్‌డౌన్ పరిధిలోకి రాబోతోంది. ఏ ఒక్కరిని గీతదాటి రానివ్వకుండా కట్టడి చేయాలని నిర్ణయిం చారు. ఆయా ప్రాంతాల ప్రజలకు నిత్యావసరాలు, మందులు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తు న్నారు. ఏలూరు సహా ఏడు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలులోకి రాబోతుంది. నరసాపురం, పెనుగొండ, మొగల్తూ రు, పోడూరు మండలాల పరిధిలో అత్యధిక కేసులు నమో దైనచోట్ల లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. మరోవైపు ఏలూరు కార్పొరేషన్, నరసాపురం మునిసిపాలిటీలలో అత్యధిక భాగం రెడ్‌జోన్ పరిధిలో ఉండడమే కాకుండా వరుస కేసులు వస్తుండడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందై నా కేసుల కట్టడి తగ్గడానికి ఈ త రహా ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేశారు.
నేటి నుంచి లాక్‌డౌన్
నగరంతోపాటు గ్రామాల్లోను కరోనా పాజిటివ్ కేసులు ఉధృతమవుతుండడంతో నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. కేసు లు అధికంగా వన్‌టౌన్ ప్రాంతాల్లో నమోదు కావడంతో లాక్‌డౌన్ విధించనున్నారు. నగరంలో.. 3, 4, 8, 9, 12, 14, 39, 40, 46, 48 వార్డులు, రూరల్‌లోని వెంకటాపురం పం చాయతీ పరిధిలోని నాగేంద్రకాలనీ, నాగేశ్వరపురం, ఎం ఎం కాలనీ, బగ్గయ్యపేట, ఇందిరా కాలనీ, ఆండాళ్లమ్మతోట సోమవారం నుంచి లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. రాకపోకలు నిషేధించేందుకు ఏలూరు పాతబస్టాండ్, కర్రల వంతెన, వసంత మహల్ సెంటర్ల వద్ద ఉన్న వం తెనలు బ్లాక్ చేసి బారి కేడ్లు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ కారణంగా నిన్నటి వరకూ రద్దీగా కనిపించిన కెనాల్ రోడ్డు, మెయిన్‌రోడ్డు నిర్మానుషంగా కనిపించాయి.
తీర ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరు గుతున్న నేపథ్యంలో అధికారులు సోమవారం ఉదయం నుంచి నరసాపురం పట్టణం, గ్రామాలతోపాటు, మొగల్తూ రులోను లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు పాలు, కూరగాయలు, కిరాణా దుకాణాలకు అనుమతిస్తారు. మెడికల్ షాపులు యథావిధిగా పనిచేస్తాయి. పట్టణంలో 2, 6, 8, 14 వార్డుల్లో కొత్త కేసులు నమోదు కావడంతో రెడ్‌జోన్‌లోకి వెళ్లిపోయాయి. 500 మీటర్ల మేర ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేశారు. పట్టణ పరిధిలో కస్టర్ల సంఖ్య తొమ్మిదికి పెరిగాయి. స్టీమ ర్, మెయిన్‌రోడ్, చినమామిడిపల్లి, స్టేషన్‌పేట, వీవర్స్‌కాలనీ, వైఎస్సార్ కాలనీ, రుస్తుంబాద, థామస్‌వంతెన మినహా మిగిలిన ప్రాంతాలు రెడ్, బఫర్‌జోన్ ప్రాంతాలకు వెళ్లాయి.
జిన్నూరు, పోడూరు గ్రామాల్లో లాక్‌డౌన్ విధి స్తున్నట్టు తహసీల్దార్ ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ గ్రామాల ప్రజలు ఎవరూ బయటకు వెళ్లకుండా.. బయటివారు లో నికి రాకుండా రహదారులను మూసివేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు నిత్యావసర సరుకులందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నరసాపురం-నిడదవోలు జాతీయ రహదా రిని జిన్నూరు నుంచి మార్టేరు వరకూ మూసివేసినట్లు ఎస్‌ఐ సురేంద్రకుమార్ తెలిపారు. తణుకు, నిడదవోలు వెళ్లే వాహనాలను పాలకొల్లు బైపాస్ నుంచి పెనుమదం మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు.
815కు చేరిన కేసులు
జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 54 కరోనా పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి.ఇందులో ఒక ఎమ్మెల్యే గన్‌మెన్‌కు పాజిటివ్ నిర్ధారణ అయింది.ఏలూరు నగరంలో మంచి నీళ్ల తోట, గాంధీ కాలనీ, బెనర్జీపేట, తూర్పువీధి, ఆర్‌ఆర్ పేట,గుబ్బల వారివీధి, శనివారపుపేట ఇందిరాకాలనీ, అశోక్‌నగర్‌లోని ఒక అపార్టుమెంట్, ఉప్పువారి వీధి, ద్వార పురెడ్డివారి వీధి, కొత్తపేట, టెలికం నగర్, నాగేంద్ర కాలనీ, మారుతీ నగర్, నూతివారి వీధి, కూనిశెట్టివారి వీధి ప్రాం తాల్లో 33 కేసులు బయటపడ్డాయి. వీరిలో అంబులెన్స్ డ్రైవర్‌కు పాజిటివ్ సంక్రమించింది. నరసాపురం 23 వార్డు,మల్లావారివీధి, యరకల వారివీధి, సానివారిపేటల్లో ఐదు కేసులు తాజాగా నమోదయ్యాయి.
భీమవరం మెంటే వారితోటలో తాజాగా మరో ఇద్దరికి రూరల్ మండలం తాడేరులో ఒకరికి వైరస్ సంక్రమించినట్లు నిర్ధారణ అయింది.తాడేపల్లిగూడెం మండలం జగన్నాఽథపురంలో ఇద్దరికి, పెనుమంట్రలో ఒకరికి, యలమంచిలి మండలం నేరేడు మిల్లిలో ఒకరికి, పోలవరం మండలం కొత్త పట్టిసీమలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీటితో కలిపి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 815 కేసులు నమోద య్యాయి. ఆదివారం నమోదైన తాజా కేసులతో ఏలూరు గుబ్బలవారి వీధి, గాంధీకాలనీ, శనివారపు పేట ఇందిరా కాలనీ, బెనర్జీ పేట, వట్లూరు టెలికంనగర్‌ల తోపాటు భీమవరం, యలమంచిలిలో కొత్త కంటైన్మెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.