‘పశ్చిమ’లో 60 వేలు దాటేసిన కేసులు.. తాజాగా ఎంతమందికి పాజిటివ్ అంటే..

ABN , First Publish Date - 2020-09-18T17:18:35+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల ఉధృతి ఏ..

‘పశ్చిమ’లో 60 వేలు దాటేసిన కేసులు.. తాజాగా ఎంతమందికి పాజిటివ్ అంటే..

ఏలూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. గురువారం ఒక్కరోజే 1,200 కేసులు వెలుగు చూడగా.. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 61,103కు చేరింది. గురువారం అత్యధికంగా పాలకొల్లు 75 నమోదయ్యాయి. తర్వాత తణుకు 73, నరసాపురం 70, ఏలూరు 69, భీమవరం 62, తాడేపల్లిగూడెం 55, జంగారెడ్డిగూడెం 43, నిడదవోలు, కొవ్వూరు, ఆకివీడుల్లో ఐదు చొప్పున, గ్రామీణ మండలాలైన పెనుగొండ 50, ఉండ్రాజవరం 49, యలమంచిలి 48, పోడూరు 45, పెంటపాడు 41, నిడమర్రు 39, ఇరగవరం 36, భీమడోలు 32, పెనుమంట్ర 31, గణపవరం 29, ఉంగుటూరు 26, ఆచంట 25, కొయ్యలగూడెం 22, పెరవలి 21, పాలకోడేరు 20, ఉండి 18, నల్లజర్ల 17, వీరవాసరం 17, మిగిలిన మండలాల్లో పది, అంతకంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. గురువారం నలుగురు మరణించగా ఇప్పటి వరకు ఈ సంఖ్య 405కు చేరింది. 

Updated Date - 2020-09-18T17:18:35+05:30 IST