‘పశ్చిమ’లో ఆగని కరోనా ఉధృతి.. గడిచిన 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-09-16T17:35:33+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా..

‘పశ్చిమ’లో ఆగని కరోనా ఉధృతి.. గడిచిన 24 గంటల్లో..

ఏలూరు(పశ్చిమ గోదావరి): జిల్లాలో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 1529 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 58,854కు చేరుకున్నది. మంగళవారం నమోదైన కేసులలో అత్యధికంగా 120 కేసులు భీమవరంలో నమోదవ్వగా ఏలూరు 105, తణుకు 103 కేసులు నమోదయ్యాయి. జంగారెడ్డిగూడెం 93, పాలకొల్లు 51, తాడేపల్లిగూడెం 70, నిడదవోలు 47, నరసాపురం 42, కొవ్వూరు 29, ఆకివీడు 22 కేసులు నమోదయ్యాయి.


గ్రామీణ మండలాల్లో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తున్నది. మంగళవారం పెనుమంట్రలో 63, మొగల్తూరు 54, ఉండి 52, గోపాలపురం 47, నిడమర్రు 34, గణపవరం 33, దేవరపల్లి 33, వీరవాసరం 31, పెనుగొండ 28, పెదవేగి 27, ఉంగుటూరు 27, పెంటపాడు 26, కుక్కునూరు 22, ద్వారకా తిరుమల 20, పోలవరం 20, కాళ్ళ 20, అత్తిలి 18, కొయ్యలగూడెం 16 కేసులు నమోద య్యాయి. వీటితో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో సగటున 10 కేసులు చొప్పున నమోదయ్యాయి.


శృంగవృక్షం గ్రామానికి చెందిన 51 సంవత్సరాల వ్యక్తి  మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. పాలకోడేరుకు చెందిన ఎలక్ట్రీషియన్‌ (44) మంగళవారం మృతిచెందారని స్థానికులు తెలిపారు.కరోనా కారణంగా మంగళవారం నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 396కు చేరుకున్నది. 


16 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు

ఏలూరు: జిల్లాలో నూతనంగా 16 కంటైన్మెంట్‌ జోన్లు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ప్రకటించారు. తణుకు అర్బన్‌ 28వ వార్డు, పెదవేగి మండలం బాపిరాజుగూడెం 1, దుగ్గిరాల 1వ వార్డు, వీర వాసరం మండలం సిహెచ్‌ గురువు 3వ వార్డు, చిం తలపూడి మండలం రేచర్ల 4వ వార్డు, పెనుమంట్ర మండలం మాల్లిపూడి 10వ వార్డు, జీలుగుమిల్లి మండలం రచన్నగూడెం 4వ వార్డు, తాడేపల్లిగూడెం అర్బన్‌ సీతారాంపేట 20వ వార్డు, జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం 4, 6 వార్డులు, తణుకు మండలం కోణాల 6వ వార్డు, గణపవరం మండలం ఎస్‌ కొండేపూడి 8, 9 వార్డులు, గోపాలపురం మండలం గంగోలు 9వ వార్డు, ఏలూరు మండలం తంగెళ్ళమూడి 14వ వార్డు, కుక్కునూరు 6, 8, 10 వార్డులు, పాలకొల్లు అర్బన్‌ ఎడ్ల బజార్‌ 13వ వార్డు, ఉంగుటూరు మండలం బొమ్మిడి 3వ వార్డు, ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించినట్లు కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-16T17:35:33+05:30 IST