ప.గో.లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా ఉధృతి.. ఒక్కరోజులోనే..

ABN , First Publish Date - 2020-09-01T17:22:46+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే..

ప.గో.లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా ఉధృతి.. ఒక్కరోజులోనే..

ఏలూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ఉధృతి  రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 1,446 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఈ సంఖ్య 40,276కు చేరింది. కొద్ది రోజులుగా రోజుకు సుమారు 1500 కేసులు నమోదు అవుతుండటంతో వారం రోజుల్లో అర లక్షకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమవ రం 130, ఏలూరు 103 కేసులు వెలుగు చూశాయి.  తాడేపల్లిగూడెం 92, తణుకు 79, నరసాపురం 79, కొవ్వూరు 76 నమోదయ్యాయి. నిడదవోలు 28, పాలకొల్లు 19, జంగా రెడ్డిగూడెం 18 కేసులు నమోదు కావడంతో మూడు రోజు లుగా పాజిటివ్‌ కేసులు తగ్గినట్లైంది. గ్రామీణ మండలాల్లో యలమంచిలిలో 56 కేసులు నమోదయ్యాయి. ఆచంట 41, పెనుమంట్ర 41, పెనుగొండ 41, అత్తిలి 40, భీమడోలు 39, దెందులూరు 35, తాళ్లపూడి 32, పెంటపాడు 30, కామ వరపుకోట 27, పాలకోడేరు 25, ఆకివీడు 25, పోలవరం 22, చింతలపూడి 22, వీరవాసరం 21, పెదపాడు 20, మొగ ల్తూరు 15, ఉండ్రాజవరం 15, ఇరగవరం 14, ద్వారకా తిరు మల 13, దేవరపల్లి 12, పోలవరం 11, నిడమర్రు 10 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా సోమవారం  ఏడుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటివరకు మరణిం చిన వారి సంఖ్య 307కు చేరింది.


సిటీ స్కాన్‌ ఉంటేనే ఎంట్రీ..!

జంగారెడ్డి గూడెం, ఆగస్టు 31 : కరోనా మహ మ్మారి కారణంగా  చిన్న చిన్న ఆరోగ్య సమ స్యలకు వేలాది రూపాయలు వదిలిపోతున్నాయి. వర్షాకాలం కావడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. కరోనాతో జ్వరాలకు ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూసేవారే కరువయ్యారు. జంగారెడ్డిగూడెంలో చిన్న పాటి జ్వరం, దగ్గు, రొంప ఏది వచ్చినా ప్రైవేట్‌ ఆసుపత్రు లకు వెళ్తున్నారు. అక్కడ కొవిడ్‌ టెస్ట్‌ లేదా సిటీ స్కాన్‌ తెచ్చుకోండి అప్పుడే చూస్తామని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కొవిడ్‌ టెస్ట్‌ చేయమంటే లక్షణాలు లేకుండా చేయమంటారు. ఒకవేళ చేసినా వెంటనే రిపోర్టులు ఇవ్వరు. దీంతో సిటీ స్కాన్‌ చేయించుకుంటున్నారు. ఒక్కో టెస్ట్‌కు రూ.4 వేలు అవు తోందని బాధితులు చెబుతున్నారు. వీటికి మరికొన్ని టెస్ట్‌లు, మందులు వెరసి జేబులన్నీ ఖాళీ అవుతున్నాయి.


Updated Date - 2020-09-01T17:22:46+05:30 IST