పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం

ABN , First Publish Date - 2020-07-19T14:54:58+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 545 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఏలూరులో 207 కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయం. ఏలూరు రాణీనగర్‌లో ఒకే ఏరియాలో 25 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే జిల్లాలో ఐదు మంది ప్రాణాలు విడిచారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 50 దాటింది.


కాగా.. కొత్త కేసులతో కలిపితే జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 3,907కు చేరుకుంది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు యధేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి మరింత పెరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు పాజిటివ్ వచ్చి రోజులు గడుస్తున్నా బాధితులను ఆసుపత్రికి తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం బయటపడుతోంది. అలా పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లో వారితో కలిసి ఉండటం, ఇంకొందరు బయట తిరగడంతో బాధితులు ఎక్కువైపోతున్నారని తెలుస్తోంది.

Updated Date - 2020-07-19T14:54:58+05:30 IST