కాంట్రాక్టు కష్టాలు తీరవా..

ABN , First Publish Date - 2020-10-29T04:32:02+05:30 IST

కాంట్రాక్టు కష్టాలు తీరవా..

కాంట్రాక్టు కష్టాలు తీరవా..
భీమవరం మునిసిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న కాంట్రాక్ట్‌ వర్కర్లు

మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన

భీమవరం టౌన్‌, అక్టోబరు 28 : మునిసిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపాల్టీ వద్ద బుధవారం కార్మి కులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ కరోనా ఎదుర్కొని ప్రజలకు సేవ చేసిన కార్మికులకు మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ అవుతాయని ఆశించారని, కానీ ఉద్యోగ భద్రత కరువైయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధనాల పెద్దిరాజు, బంగారు వరలక్ష్మి, బి.విజయలక్ష్మి, ధనలక్ష్మి, కామాక్షి నేలపట్ల నాగేశ్వరరావు, నీలపు రవి, పాపన్న, తదితరులు పాల్గొన్నారు.


ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు వేతన బకాయిలు, హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, క్వారంటైన్‌ సెంటర్‌లలో పనిచేస్తున్న వర్కర్స్‌కు ఆగస్ట్‌, సెప్టెంబరు, అక్టోబరు నెలల జీతాలు వెంటనే ఇప్పించాలన్నారు. 2004లో నియామకమైన పర్మినెంటు వర్కర్స్‌కు సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలన్నారు.


కాంట్రాక్టు వర్కర్ల ధర్నా

నరసాపురం టౌన్‌, అక్టోబరు 28: వేతన బకాయిలు చెల్లించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చారు. హెల్త్‌ అలవెన్స్‌, 60 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్‌ కార్మికులకు సీపీఎస్‌ రద్దు చేయాలని నినాదాలు చేశారు. నెక్కం టి సుబ్బారావు, క్రాంతికుమార్‌, నర్సింహారావు, మేరీ ప్రసాద్‌, విజయశేఖర్‌, వరప్రసాద్‌, స్వామినాయుడు, హరికృష్ణ, లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T04:32:02+05:30 IST