ఎప్పటికీ పూర్తయ్యేనో!

ABN , First Publish Date - 2020-09-06T09:22:53+05:30 IST

గ్రామ సచివాలయ భవన నిర్మాణాల పనులు మందకొడిగా సాగు తున్నాయి. జిల్లాలో 938 గ్రామ సచివాలయాలు ఉండగా

ఎప్పటికీ పూర్తయ్యేనో!

  • సాగుతున్న సచివాలయ భవనాల నిర్మాణం
  • నెలలు గడుస్తున్నా పూర్తికాని పనులు
  • 910 భవనాలకు 75 పూర్తి


ఏలూరు సిటీ, సెప్టెంబరు 5 : గ్రామ సచివాలయ భవన నిర్మాణాల పనులు మందకొడిగా సాగు తున్నాయి. జిల్లాలో 938 గ్రామ సచివాలయాలు ఉండగా వీటిలో 910 నూతన భవనాల నిర్మాణాలకు జాతీయ ఉపాధి హామీ పథకంలో రూ.334.77 కోట్లు మంజూరుచేశారు. సచివాలయానికి కేటాయించిన స్థలాన్ని బట్టి నిర్మించే భవనాలను మూడు రకాలుగా వర్గీకరించారు. టైప్‌-1 భవనానికి రూ.40 లక్షలు, టైప్‌-2 భవనానికి రూ.25 లక్షలు, టైప్‌-3 భవనానికి రూ.35 లక్షలు చొప్పున కేటాయించారు. పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు 75 భవనాలు మాత్రమే పూర్తిచేశారు. నిధుల లభ్యత వున్నా కరోనా కారణంగా పనులు ముందుకు సాగడం లేదని చెబుతున్నారు. సిమెంట్‌, ఇసుక కొరతతో పాటు కార్మికులు హాజరు తక్కువగా ఉండటం వల్ల పనులు జాప్యం జరిగాయి. తాజాగా అధికారులు దీనిపై దృష్టి సారించారు. 

Updated Date - 2020-09-06T09:22:53+05:30 IST