గ్రామాల్లో కళ తప్పిన అభివృద్ధి

ABN , First Publish Date - 2020-07-22T11:29:18+05:30 IST

గ్రామాల్లో అభివృద్ధి కళ తప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న సీసీ రహదా రులు, డ్రెయిన్‌లు

గ్రామాల్లో కళ తప్పిన అభివృద్ధి

నిలిచిన డ్రెయిన్లు, సీసీ రహదారుల నిర్మాణం 

ఒక శాతం పూర్తయిన డ్రెయిన్లకు.. 25 శాతం నిర్మించిన రహదారులకే అవకాశం 

ప్రభుత్వ  నిర్ణయంతో కాంట్రాక్టర్ల ఆందోళన

పనులు చేపట్టకపోతే ఎలా అంటూ స్థానికంగా ఒత్తిళ్లు


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అభివృద్ధి కళ తప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న సీసీ రహదా రులు, డ్రెయిన్‌లు అర్ధంతరంగా నిలిపివేశారు. నిధులు కొరత వల్లే ప్రభుత్వం పనులకు చెక్‌ పెట్టింది. గ్రామా ల్లో ఒక్క శాతం పూర్తయిన డ్రెయిన్‌లు, 25 శాతం పూర్తయిన రహదారులు మాత్రమే చేపట్టాలని ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు పూర్తయిన పనులకు బిల్లులు నిలిచిపోయాయి. దీనిపై కాంట్రాక్టర్ల లో ఆందోళన వ్యక్తమవుతోంది.


అట్టహాసంగా పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేస్తే తమ ఉనికికే దెబ్బ తగులుతుందంటూ క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. గ్రామాల్లో ప్రధానమైన డ్రెయిన్‌ లు, రహదారులు నిర్మించాలంటూ పట్టుబడుతున్నారు. రాజకీయ నేతల నుంచి వస్తున్న ఒత్తిడితో అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పల్లెల్లో వంద శాతం సీసీ డ్రెయిన్లు, రహదారులు వేయాలని ప్రభుత్వం గతంలో సంకల్పించింది. ఆ మేరకు ప్రతి నియోజక వర్గంలోనూ ప్రజా ప్రతినిధులు పోటీ పడి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.


ప్రభు త్వం పనులు చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామాల్లో ఒక్కొక్కటిగా పనులు చేపడుతూ వచ్చారు. తొలుత బిల్లులు సమర్పించగానే విడుదలయ్యేవి. దీంతో కాంట్ర్టాక్టర్లలోనూ ఉత్సాహం ఏర్పడింది. ప్రజా ప్రతినిధు లు తమ సన్నిహితులతో పనులు చేయించేందుకు ఆస క్తిచూపారు. అదిప్పుడు మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపో యింది.  పనులు నిర్వహణపై ఆంక్షలు పెట్టింది. 


ప్రతిపాదనలు ఘనం... ప్రగతి శూన్యం 

ప్రభుత్వ అనుమతి లేనిదే ఇప్పుడు గ్రామాల్లో పనులు చేపట్టేందుకు వీలులేదు. జిల్లాలో గ్రామీణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో డ్రెయిన్‌లు, పంచాయతీ రాజ్‌ పర్యవేక్షణలో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం తొలుత ఆమోదం తెలిపింది. జిల్లావ్యాప్తంగా పంచా యతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.1,200 కోట్లు విలువైన పనులు చేపట్టేం దుకు సన్నాహాలు చేసుకున్నారు. దాదాపు పది శాతం పనులు పూర్తయ్యాయి. తాజాగా కొత్త పనులు నిర్వ హించేందుకు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తోంది.


గతంలో ప్రారంభించిన పనులకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డ్రెయిన్‌లకు సంబంధించి ఒక్క శాతం పను లు పూర్తయితే వాటిని కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి ఒక గ్రామంలో కొన్ని డ్రెయి న్‌లు కలిపి ఒక పనిగా ప్రతిపాదనలు చేశారు. అందు లో ఒక శాతం ఇప్పుడు పూర్తి కావాల్సి ఉంది. లేదంటే కొనసాగించేందుకు వీలులేదు. దీంతో క్షేత్రస్థాయి నుంచి అధికారులు ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఫలితంగా ప్రభు త్వం మరోసారి ఒకశాతం పూర్తయిన పనులకు నివేదిక పంపమని కోరింది. దీనిపై తాజాగా కసరత్తు చేస్తున్నా రు. పంచాయతీరాజ్‌ శాఖ చేపడుతున్న సీసీ డ్రెయిన్‌ల విషయానికి వచ్చేసరికి 25 శాతం పూర్తయిన రహ దారులను నిర్మించాలని దిశా నిర్దేశం చేశారు.


ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచి పోయాయి. ప్రభుత్వం ఒక్కసారిగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు చెక్‌ పెట్టడంతో అధికార పార్టీ నాయకుల్లో కలకలం రేగింది. తమ పరిధిలో డ్రెయిన్‌, రహదారులు నిర్మించకపోతే ఎలా అంటూ అధికారులను నిలదీస్తు న్నారు. తక్షణమే కొన్ని పనులు చేపట్టాలంటూ వినతు లు సమర్పిస్తున్నారు.

Updated Date - 2020-07-22T11:29:18+05:30 IST