రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం

ABN , First Publish Date - 2020-11-27T04:58:01+05:30 IST

భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నో హక్కులు అందించి వారికి మార్గదర్శిగా నిలిచిందని ప్రముఖ న్యాయవాది సత్యవిజ్ఞానదేవి అన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం
వీరవాసరం హైస్కూల్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులు

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 26 : భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నో హక్కులు అందించి వారికి మార్గదర్శిగా నిలిచిందని ప్రముఖ న్యాయవాది సత్యవిజ్ఞానదేవి అన్నారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఎన్‌ ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ కె.ప్రసాదరాజు అధ్యక్షత వహించారు. అధ్యాపకుడు కె.బ్రహ్మరాజు కెఎ.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

డీఎన్నార్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ వీరాంజనేయరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గాదిరాజు బాబు, ప్రిన్సిపాల్‌ బీఎస్‌. శాంతకుమారి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎంవీఎన్‌ భాస్కరరాజు, బీవీ.నరసింహరాజు, కె.సోమయ్య, ఎస్‌.అనిల్‌దేవ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


భీమవరం:  భీమవరం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి రాజా వెంకటాద్రి కోర్టు సిబ్బందితో ప్రమాణాలు చేయించారు. రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె బాలకోటేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బొక్కా శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.


భీమవరం టౌన్‌: భారత రాజ్యాంగం శిరోధార్యమని ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికిముక్కు సబ్బయ్య అన్నారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలువేసి నివాళ్ళు అర్పించారు. ఈకార్యక్రమంలో గంటి రమేష్‌కుమార్‌, గొంతెన శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.


వీరవాసరం: వీరవాసరం, కొణితివాడ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నందు రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. వీరవాసరం జడ్పీహైస్కూల్‌లో మండల మాలమహానాడు అధ్యక్షుడు తాడి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి రాజశేఖర్‌, హెచ్‌ ఎం బి.ప్రభామంజరి, ఎస్‌ఐ సీహెచ్‌.ఎస్‌ రామచంద్రరావు, ఎల్‌.సాయిశ్రీనివాస్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.


నరసాపురం టౌన్‌: పట్టణం, మండలంలో రాజ్యాంగ పరిరక్షణ దినం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోర్టు హాల్‌లో  న్యాయమూర్తి వి గౌరి శంకరరావు న్యాయవాదులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. బీజీబీఎస్‌ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌ అమ్మాజీ, మధుషాలిని, విజయకుమార్‌, సాగర్‌ పాల్గొన్నారు. పీచుపాలెం సదురసత్‌ ఫౌండేషన్‌ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కె.రుషేంద్రరావు, పెమ్మాడి కృష్ణంరాజు, దేశెట్టి సత్యనారాయణ, నాగరాజు, పెద్దిరాజు పాల్గొన్నారు.


ఆచంట: అంబేడ్కర్‌ భారత రాజ్యాంగం రచించి ప్రపంచంలోని అన్ని వర్గాలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని ఏఎంసీ చైర్మన్‌ సుంకర ఇందిరాసీతారాం కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సొసైటి చైర్మన్‌ కాండ్రేకుల సత్యనారాయణ, కోట సోమరాజు, సల్లపూడి ఏసుబాబు, బొరుసు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:58:01+05:30 IST