కొవిడ్‌ను జయించి విధుల్లోకి..

ABN , First Publish Date - 2020-08-01T11:03:43+05:30 IST

కొవిడ్‌ను జయించి విధులకు హాజరైన పాలకొల్లు రూరల్‌ ఎస్‌ఐ పి.అప్పారావుకు సీఐ దేశింశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బంది శుక్రవారం ఘన స్వాగ తం పలికారు.

కొవిడ్‌ను జయించి విధుల్లోకి..

పాలకొల్లు, ఆచంటలో తిరిగివచ్చిన అధికారులు


పాలకొల్లు రూరల్‌, జూలై 31: కొవిడ్‌ను జయించి విధులకు హాజరైన పాలకొల్లు రూరల్‌ ఎస్‌ఐ పి.అప్పారావుకు సీఐ దేశింశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బంది శుక్రవారం ఘన స్వాగ తం పలికారు. ఎస్‌ఐ అప్పారావు మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వస్తే భయ పడాల్సిన అవసరం లేదని, సరైన పోషకాలు కలిగిన వేడి ఆహారం తీసుకుం టూ, యోగా, వ్యాయామం చేయాలన్నారు. సరైన సమయంలో చికిత్స పొందుతూ మనోధైర్యం కలిగి ఉంటే కరోనాను జయించవచ్చన్నారు.


ఆచంట : ఆచంట తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో ఇద్దరు ఉన్న తాధికారులకు కరోనా పాజిటివ్‌ రావడంతో 15 రోజుల క్రితం క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి మెరుగుపడడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇద్దరూ పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం విధులకు హాజరయ్యారు. ఆయా కార్యాలయాల సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికారు.


రెడ్‌జోన్‌లో కనీస సౌకర్యాలుండాలి


పాలకొల్లు టౌన్‌, జూలై 31: రెడ్‌జోన్‌ ప్రాంతంలో కనీస సౌకర్యాలకు లోటు రానివ్వద్దని ఎమ్మెల్యే డాక్టర్‌  నిమ్మల రామానాయుడు మునిసిపల్‌ అధికారులకు సూచించారు. 31వ వార్డులోని రెడ్‌జోన్‌ ప్రాంతాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నిమ్మల పరిశీలించి వార్డు ప్రజలకు ధైర్యం చెప్పారు.


మాస్క్‌ లేకపోతే చర్యలు


యండగండి (ఉండి), జూలై 31: యండగండిలో వలంటీర్లు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారికి అవగాహన కల్పిస్తూ మాస్క్‌లు అందిస్తు న్నారు. మాస్క్‌ లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించారు. దుకాణాల వద్దకు మాస్క్‌ లేకుండా వస్తే వారికి పైన్‌ విధిస్తున్నారు.

Updated Date - 2020-08-01T11:03:43+05:30 IST