-
-
Home » Andhra Pradesh » West Godavari » congres party vyavasthapaka dinotsavam west godavari dist
-
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ABN , First Publish Date - 2020-12-29T04:54:15+05:30 IST
స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఏలూరు కార్పొరేషన్, డిసెంబరు 28 :స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అవలంభిం చిన విధానాల వల్లే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఇన్‌చార్జి రాజనాల రామ్మోహన్‌రావు, సేవాదళ్ స్టేట్ కో–ఆర్డినేటర్ కమ్ముల కృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు శీలం కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ విభాగాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.