స్థానిక పంటలపై పరిశోధనలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-07-14T11:37:16+05:30 IST

స్థానికంగా రైతులు పండించే పంటలపై ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధనా కేంద్రాల శాస్త్ర వేత్తలు పరిశోధనలు ..

స్థానిక పంటలపై పరిశోధనలు నిర్వహించాలి

ఉద్యాన వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ జానకిరామ్‌


తాడేపల్లిగూడెం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): స్థానికంగా రైతులు పండించే పంటలపై ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధనా కేంద్రాల శాస్త్ర వేత్తలు  పరిశోధనలు నిర్వహించాలని వీసీ జానకిరామ్‌ సూచించారు. ఉద్యా న పరిశోధన కేంద్రం ప్రత్యేక యాప్‌ను రూపొందించి రైతులకు ఉపయో గపడే సమాచారం అందించాలన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయంలో సోమవా రం పరిశోధనా కేంద్రాల శాస్త్ర వేత్తలతో సమీక్ష నిర్వహించారు. నూతన వంగడాలు ప్రత్యేకంగా జన్యు రకాల ఉత్పత్తి చేసినప్పుడు ఆయా జాతీయ సంస్థల్లో నమోదు చేసు కోవాలని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వాలు తమ పథకాల్లో వీటిని పొందుపరచి రైతుల వద్దకు చేర్చే అవకాశం ఉంటుంద న్నారు. విశాఖపట్నం చింతపల్లి పరిశోధనా కేంద్రంలో సేంద్రియ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.


తూర్పుగోదావరి జిల్లాలో పరిశోధనలు నిర్వ హిస్తున్న చిలకడదుంపల్లో పోషక విలువల ఆధారిత ఉత్పత్తులు రూపొం దిస్తే మార్కెట్‌లో డిమాండ్‌ అధికంగా ఉంటుందని తెలిపారు. ఉద్యాన పంటల ఎగుమతులను అందిపుచ్చుకోవాలని, అందుకోసం జాతీయ సంస్థ లైన ఎంపెడా, సంబంధిత పరిశ్రమలతో సమన్వయం చేసుకోవాలని సూచిం చారు. పరిశోధనా సంచాలకులు రెడ్డి పర్యవేక్షించారు. రిజిస్ర్టార్‌ కె.గోపాల్‌, విస్తరణ సంచాలకులు బి.శ్రీనివాసులు, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ ఎంఎల్‌ఎన్‌ రెడ్డి, కె.దిలీప్‌ బాబు, ఎ.సుజాత, డి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T11:37:16+05:30 IST