-
-
Home » Andhra Pradesh » West Godavari » colector
-
సంక్షేమ పథకాలు త్వరితగతిన గ్రౌండింగ్ కావాలి
ABN , First Publish Date - 2020-12-10T05:51:58+05:30 IST
పేద ప్రజల సంక్షేమ పథకాలు త్వరితగతిన గ్రౌం డింగ్ అయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఆదేశించారు.

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
ఏలూరు సిటీ, డిసెంబరు 9: పేద ప్రజల సంక్షేమ పథకాలు త్వరితగతిన గ్రౌం డింగ్ అయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి బుధవారం కలెక్టర్ జిల్లాలోని ఎంపీడీవోలు, ఏపీఎంలతో జగనన్నతోడు, వైఎస్‌ఆర్ బీమా, జగనన్న చేయూత పథకాల అమలుపై సమీక్షించారు. జగనన్నతోడు పథకం ప్రారంభించి నెలరోజులు గడచినా ఇంకా గ్రౌండింగ్ చాలా తక్కువగా ఉండటంపై అసహనాన్ని వ్యక్తం చేశా రు. 74,471 మంది దరఖాస్తులను ఆమోదించగా గ్రౌండింగ్ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఈనెల 14వతేదీ లోపు లక్ష్యాలను అధిగమించకపోతే 15వ తేదీన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వైఎస్‌ఆర్ బీమా అమలుకు 9,52,518 రైస్ కార్డులు కలిగిన కుటుంబాలలో కుటుంబ పోషకులను గుర్తించి నమోదు చేయాల్సి ఉండగా నమోదు శాతం తక్కువగా ఉందన్నారు. సమావేశంలో జేసీ ఎన్.తేజ్‌భరత్, డీఆర్‌డీఏ పీడీ జె.ఉదయ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.