ఇళ్ల స్థలాల లే అవుట్లలో రోడ్లేవి..?
ABN , First Publish Date - 2020-12-01T05:41:20+05:30 IST
ఇళ్ల స్థలాల లే అవుట్‌లలో రోడ్లు పూర్తి చేయకపోవడంతో అధికారులపై జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులపై కలెక్టర్ ముత్యాలరాజు ఆగ్రహం
దేవరపల్లి, నవంబరు 30 : ఇళ్ల స్థలాల లే అవుట్‌లలో రోడ్లు పూర్తి చేయకపోవడంతో అధికారులపై జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం, దేవరపల్లి, సంగాయిగూడెంలో ఇళ్ల స్థలాలను సోమవారం ఆయన పరిశీలించారు. లే అవు ట్‌లలో ఇంకా రోడ్లు పూర్తి కాకపోవడంతో ఆయన మండి పడ్డారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో పది రోజుల్లోగా రోడ్లను పూర్తి చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుం టానని హెచ్చరించారు.అంతకుముందు ఎంపీడీవో కార్యా లయ ంలో వివిధ శాఖల అఽధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. డిసెంబరు 25న ఇళ్ల స్థలాల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల పట్టాలను సమగ్రంగా పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికపై లాటరీని పారదర్శకంగా నిర్వహిం చాలని ఆదేశించారు. మండలంలోని రైతు భరోసా కేం ద్రాలు ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మా ణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్‌ఆర్‌జీఎస్, వీఆర్వోలు, పంచా యతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమీక్ష జరిగింది. ఆర్‌డీవో లక్ష్మారెడ్డి, డీడీవో జగదాంబ, తహసీల్దార్ సోమేశ్వరరావు, ఎంపీడీవో ఉమమహేశ్వరశర్మ, తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లిలో ఏడో తేదీన సీఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు సం బంధిం చిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. హెలీ ప్యాడ్‌కు జడ్పీ హైస్కూల్ ప్రాంగణాన్ని, భోజనాలకు ఏర్పాటు చేసిన పొగాకు బోర్డు ఆవరణను చూసి.. భద్రతా ఏర్పాట్లు కట్టుది ట్టంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.