నేడు సీఎం జగన్‌ రాక

ABN , First Publish Date - 2020-12-07T05:48:02+05:30 IST

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి సీఎం వైఎస్‌.జగన్మో హన్‌రెడ్డి సోమ వారం ఉదయం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రాను న్నారు.

నేడు సీఎం జగన్‌ రాక

ఏలూరు క్రైం, డిసెంబరు 6: ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి సీఎం వైఎస్‌.జగన్మో హన్‌రెడ్డి సోమ వారం ఉదయం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రాను న్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్‌ నుంచి ఉదయం 9.45 గంటలకు బయలుదేరి 10.10 గంటలకు ఏలూరు సీఆర్‌ఆర్‌ కాలేజీలో ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి 10.15 గంటలకు రోడ్డు మార్గంలో బయలు దేరి 10.20 గంటలకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటారు. ఆసు పత్రిలో బాధితులతో 10.35 గంటల వరకూ మాట్లాడతారు. అక్కడ నుంచి జడ్పీ మీటింగ్‌ హాలుకు చేరుకుని అధికారులతో సమీక్షి స్తారు. 11.25 గంటలకు బయలుదేరి సీఆర్‌ఆర్‌లో హెలీప్యాడ్‌కు చేరు కోనున్నారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11.55 గంటలకు దేవరపల్లి జడ్పీ హైస్కూలులో ఉన్న హెలీప్యాడ్‌ వద్ద దిగనున్నారు. 12.05 గంటల వరకూ దేవరపల్లి టుబాకో బోర్డు ఆక్షన్‌హాలులో అధికార, అనధికారులతో ముచ్చటించనున్నారు. 12.15 గంటలకు అక్కడికి చేరుకుని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. 12.25 గంట లకు అక్కడ నుంచి బయలుదేరి 12.30 గంటలకు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. 12.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళతారు. ఈ మేరకు ముందస్తుగా ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.  


Updated Date - 2020-12-07T05:48:02+05:30 IST