-
-
Home » Andhra Pradesh » West Godavari » cm
-
4న సీఎం జగన్ ఏలూరు రాక
ABN , First Publish Date - 2020-11-01T04:43:16+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 4వ తేదీన ఏలూరులో పర్యటించనున్నారని ఉప ముఖ్య మంత్రి ఆళ్లనాని తెలిపారు.

తమ్మిలేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన
ఏలూరు రూరల్, అక్టోబరు 31 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 4వ తేదీన ఏలూరులో పర్యటించనున్నారని ఉప ముఖ్య మంత్రి ఆళ్లనాని తెలిపారు. తంగెళ్లమూడి వంతెన వద్ద తమ్మిలేరు రిటైనింగ్‌వాల్ నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం మాజీ మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతుల కుమార్తె వివాహ వేడుకకు హాజర య్యేందుకు ఏలూరు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్‌తో కలిసి పరిశీలించారు.