వస్త్ర దుకాణాల్లో ట్రయల్‌ రూమ్‌లు మూసేయండి

ABN , First Publish Date - 2020-05-27T11:07:34+05:30 IST

ప్రభుత్వం బంగారం, వస్త్ర దుకాణాలు, సెలూన్‌ షాపులకు షరతులతో కూడిన సడలింపు ఇచ్చిందని..

వస్త్ర దుకాణాల్లో ట్రయల్‌ రూమ్‌లు మూసేయండి

 బంగారం, వస్త్ర, షూమార్ట్‌లు తెరవొచ్చు

 షరతులతో కూడిన సడలింపులిచ్చిన ప్రభుత్వం


తాడేపల్లిగూడెం రూరల్‌/ భీమవరం క్రైం, మే 26 : ప్రభుత్వం బంగారం, వస్త్ర దుకాణాలు, సెలూన్‌ షాపులకు షరతులతో కూడిన సడలింపు ఇచ్చిందని తహసీల్దార్‌ సాయిరాజ్‌ తెలిపారు.తాడేపల్లిగూడెం,భీమవరంలో మంగళవారం దుకాణ యజమానులతో అధికారులు సమావేశం నిర్వహించారు. పట్టణ సీఐ ఆకుల రఘు మాట్లాడుతూ వస్త్ర దుకాణంలో ట్రయల్‌ రూంలు ఉండరాద న్నారు.సెలూన్‌ షాపుల వద్ద మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు. నిబం ధనలు పాటించకపోతే దుకాణ యజమానులపై కేసులు తప్పవని హెచ్చరించారు. బంగారు, వస్త్ర దుకాణాల్లో ఖాతాదారుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని భీమవరం వన్‌ టౌన్‌ సీఐ కృష్ణభగవాన్‌ తెలిపారు.


లాక్‌డౌన్‌తో మూతపడిన బంగారం, వస్త్ర, చెప్పులు దుకాణాలు తెరవడానికి మంగళవారం భీమవరం, తాడేపల్లిగూడెంలో అధికారులు అనుమతించారు. తాడేపల్లిగూడెంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే అనుమతివ్వగా.. భీమవరంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెంలో ఎంపీడీవో మల్లికార్జునరావు, ఎస్‌ఐ గుర్రయ్య, షాపులు దుకాణాల యజమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T11:07:34+05:30 IST