మద్యం దుకాణం మూసివేయండి

ABN , First Publish Date - 2020-08-01T11:02:13+05:30 IST

మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ అయితం పూడి గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

మద్యం దుకాణం మూసివేయండి

మహిళల ఆందోళన


ఇరగవరం, జూలై 31 : మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ అయితం పూడి గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇరగవరం మండలం అయితంపూడిలో శుక్రవారం మద్యం దుకాణం వద్దకు చేరుకుని మహిళలు ఆందోళన నిర్వహించారు. లాక్‌డౌన్‌ నుంచి మూతపడిన మద్యం దుకాణం గురువారమే పునఃప్రారంభించారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో మద్యం దుకాణం తెరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


మద్యం దుకాణాలతో కరోనా వ్యాప్తి

కొవ్వూరు, జూలై 31: ప్రభుత్వం మద్యం దుకాణాల్లో విక్రయాలకు అనుమతులివ్వడంతో కరోనా వ్యాప్తి మరింత ఉదృతమైందని టీడీపీ జిల్లా కార్యదర్శి కేవీకే రంగారావు విమర్శించారు. మద్యం దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించకపోవడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర దుకాణాలు మూసివేసి మద్యం షాపులు తెరవడం ఏమిటని ఆగ్రహించారు. దుకాణాల వద్ద భౌతిక దూరం విస్మరిస్తు న్నారని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చే వరకు ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలన్నారు.

Updated Date - 2020-08-01T11:02:13+05:30 IST