సిగరెట్టు.. అదిరేటు!

ABN , First Publish Date - 2020-05-10T08:53:10+05:30 IST

ధూమపాన ప్రియుల జేబులకు దర్జాగా కన్నం వేస్తున్నారు. అలవాటును ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ..

సిగరెట్టు.. అదిరేటు!

గోల్డ్‌ ఫ్లేక్‌ కింగ్‌ రూ. 250  - బీడీ కట్ట రూ. 50


తణుకురూరల్‌/ఆకివీడు రూరల్‌, మే 9 : ధూమపాన ప్రియుల జేబులకు దర్జాగా కన్నం వేస్తున్నారు. అలవాటును ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు పొగరాయుళ్లను దోచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కిళ్లీ షాపులు నుంచి కిరాణా షాపుల వరకూ 47 రోజుల పాటు తెరుచుకోలేదు. దీంతో చేంజ్‌ స్మోకర్స్‌కు ఇబ్బందులు వచ్చిపడ్డాయి..


సిగరెట్‌ లేదంటే చుట్ట అదీ లేదంటే బీడీ ఏదో ఒక తాగాల్సిందే. ఇదే అక్రమార్కులకు అవకాశంగా మారింది. అంతే ఒక్క సారిగా ధరలను అమాంతం పెంచేశారు. గోల్డ్‌ ఫ్లేక్‌ కింగ్‌ సైజు పెట్టి ఎమ్మార్పీ రూ.165 దీనిని బ్లాక్‌ మార్కెట్‌లో రూ.250లకు విక్రయిస్తున్నారు. రూ.80లకు అమ్మే విల్స్‌ ఫ్లేక్‌ సిగరెట్లను రూ.150లకు, రూ.100 అమ్మే గోల్డ్‌ఫ్లేక్‌ రూ. 140కు, రూ.10        విలువ గల సిగరెట్‌ ప్యాకెట్‌ రూ.30లకు, రూ.20 ఉండే బీడీ కట్ట బ్లాక్‌ మార్కెట్‌లో రూ.50 పలుకుతున్నది. లాక్‌డౌన్‌కు ముందు రూ. 15లకు అమ్మే ఖైనీ ప్యాకెట్‌ రూ.75కు విక్ర యిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. 

Updated Date - 2020-05-10T08:53:10+05:30 IST