క్రిస్మస్‌ సందడి

ABN , First Publish Date - 2020-12-25T05:52:37+05:30 IST

లోకనాయకుడు ఆగమనానికి ఏలూరు నగరంతోపాటు గ్రామాలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్‌ వేడుకలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.

క్రిస్మస్‌ సందడి
ఏలూరు మన్నా చర్చిలో విద్యుత్‌ కాంతులు

కిటకిటలాడిన వ్యాపార, వాణిజ్య సముదాయాలు 

ఏలూరు కల్చరల్‌, డిసెంబరు 24 : లోకనాయకుడు ఆగమనానికి ఏలూరు నగరంతోపాటు గ్రామాలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్‌ వేడుకలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఏలూరు వన్‌టౌన్‌, టూటౌన్‌, మెయిన్‌ బజార్‌లలో వ్యాపార, వాణిజ్య సముదాయాల వినియోగదారులతో కిటకిటలాడాయి. చర్చిలు విద్యుద్ధీపాల వెలుగులతో కాంతులీనుతున్నాయి. శుక్రవారం క్రిస్మస్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు. క్రీస్తు జననాన్ని తెలిపే ఫ్లెక్సీలను ప్రధాన కూడళ్ళల్లో ఏర్పాటు చేశారు. ఏలూరులోని రఽపధాన చర్చిలతో పాటు మండలంలోని శనివారపుపేట, తంగెళ్ళమూడి, కొమడవోలు, జాలిపూడి, బూరాయిగూడెం, గుడివాకలంకలలోని ఏరుషా ఆలయ ప్రార్థన మందిరం, పైడిచింతపాడులోని సీబీఎన్‌, ప్రత్తికోళ్ళలంకలోని నవజీవన ప్ర్థాన మందిరం, జాలిపూడి ఆర్‌సీఎం పరిధిలోని చాటపర్రు, మాదేపల్లి, మహేశ్వర పురం, మానూరులోని చర్చిలను విద్యుద్ధీపా లతో సుందరంగా అలంకరించారు. భారీ క్రిస్మస్‌ స్టార్‌లను, రంగు రంగుల విద్యుద్ధీ పాలతో ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సాహంగా ప్రత్యేక గీతాలను ఆలపించారు. 

Updated Date - 2020-12-25T05:52:37+05:30 IST