చోడవరంలో టీవీ, నగదు చోరీ
ABN , First Publish Date - 2020-11-03T05:47:43+05:30 IST
నల్లజర్ల మండలం చోడవరంలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్టు స్థానికులు తెలిపారు.
నల్లజర్ల, నవంబరు 2: నల్లజర్ల మండలం చోడవరంలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్టు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన కూచిపూడి వెంకటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో ఆదివారం రాత్రి పై అంతస్తులో నిద్రిస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్‌లో గడియలు విరగ్గొట్టి రూ. 50 వేల విలువైన ఎల్‌సీడీ టీవీ, రూ. 5 వేలు నగదు, రూ. 20 వేలు విలువ చేసే వాచీ దొంగిలించినట్టు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దీనిపై నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితుడు పేర్కొన్నారు.