బాలల్లో చైతన్యం తీసుకురావాలి

ABN , First Publish Date - 2020-11-20T05:02:42+05:30 IST

బాలలపై వేధింపుల నిరోధానికి వారిలో చైత న్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని మాదేపల్లి గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి సబిత అన్నారు.

బాలల్లో చైతన్యం తీసుకురావాలి

ఏలూరు రూరల్‌, నవంబరు 19 : బాలలపై వేధింపుల నిరోధానికి వారిలో చైత న్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని మాదేపల్లి గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి సబిత అన్నారు. మాదేపల్లి మండల పరిషత్‌ పాఠశాలలో గురువారం చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ వేధింపుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా వేధింపులకు పాల్ప డితే 100, 1098, 112, 181 ఉచిత నెంబర్లకు సమాచారం అందించాలని సూచిం చారు. ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం వెంకటపతి రాజు, అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మి, క్రాఫ్‌ కో–ఆర్డినేటర్‌ రవిబాబు, సీఆర్‌ఎఫ్‌ వరలక్ష్మి, సుమాంజలి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T05:02:42+05:30 IST