-
-
Home » Andhra Pradesh » West Godavari » CC cameras for C category test centers
-
సీ కేటగిరి పరీక్షా కేంద్రాలకు సీసీ కెమెరాలు
ABN , First Publish Date - 2020-03-13T11:25:46+05:30 IST
పదవ తరగతి పరీక్షల్లో సీ కేటగిరి పరీక్షా కేంద్రాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీఈవో సీవీ రేణుక తెలి పారు.

మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు
పదవ తరగతి పరీక్షలపై సిబ్బందికి డీఈవో రేణుక శిక్షణ
భీమవరం ఎడ్యుకేషన్, మార్చి 12 : పదవ తరగతి పరీక్షల్లో సీ కేటగిరి పరీక్షా కేంద్రాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీఈవో సీవీ రేణుక తెలి పారు. బీవీ రాజు ఇండోర్ ఆడిటోరియంలో గురువారం 10వ తరగతి పబ్లిక్ పరీ క్షకు సంబంధించి భీమవరం, తణుకు డివిజన్‌ల ఛీఫ్ సూపరింటెండెంట్లు, డిపా ర్ట్‌మెంట్ ఆఫీసర్స్, కస్టోడియన్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎటువంటి కాపీయింగ్ జరిగినా తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరిం చారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కన్నా విద్యా ప్రమాణాలు ముఖ్యమని, పరీక్ష నిర్వహణ సక్రమంగా జరగా లన్నారు.రాష్ట్ర పరిశీలకుడు మస్తానయ్య మాట్లాడుతూ మార్చి 31 నుంచి ప్రారంభ మయ్యే పబ్లిక్ పరీక్షలకు పగడ్బంధీ ఏర్పాట్లు చేయాలన్నారు.పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగ కుండా సజావుగా జరిగేలా సిబ్బంది చూడాలని తెలిపారు. పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, డీవై ఈవో వెంకటరమణ, తణుకు డీవైఈవో వరదాచార్యులు, డీఐ సత్యానంద్, ఎంఈవో దండు సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.