-
-
Home » Andhra Pradesh » West Godavari » carona coming down
-
కరోనా తగ్గినట్టేనా..!
ABN , First Publish Date - 2020-11-21T05:49:06+05:30 IST
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గింది. ఆగస్టు, సెప్టెంబరు నెలలతో పోలిస్తే ఈ నెలలో కేసుల సంఖ్య పదోవంతుకు తగ్గడం జిల్లా వాసు లకు కొంత ఊరటనిచ్చే విషయమే అయినా కేసు లు ఇంత భారీస్థాయిలో తగ్గడంపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రజల్లో తీరని సందేహాలు
పదో వంతుకు పడిపోయిన కేసులు
భారీగా తగ్గిన టెస్టులు.. నమూనాల సేకరణ
30 నుంచి 5 శాతానికి పాజిటివిటీ రేటు
ఏలూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గింది. ఆగస్టు, సెప్టెంబరు నెలలతో పోలిస్తే ఈ నెలలో కేసుల సంఖ్య పదోవంతుకు తగ్గడం జిల్లా వాసు లకు కొంత ఊరటనిచ్చే విషయమే అయినా కేసు లు ఇంత భారీస్థాయిలో తగ్గడంపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వైద్యాధికారులు మాత్రం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు.
తగ్గిన పాజిటివిటీ రేటు
జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివి టీ రేటు బాగా తగ్గింది. ఈనెలలో టెస్టు ల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ పాజిటి విటీ రేటు మాత్రం అంతకుమించి తగ్గి నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబరులో రోజుకు సగటున 6.5 వేల టెస్టులు నిర్వహించగా ప్రస్తుతం 4 వేల టెస్టులను నిర్వహిస్తున్నారు. సెప్టెంబరులో ప్రతి రోజూ 7 వేల టెస్టులు చేయగా 15 నుంచి 18 వందల వర కూ పాజిటివ్ కేసులు వచ్చేవి. పాజి టివిటీ రేటు 25 నుంచి 30 శాతంగా ఉండేది. ప్రతి వంద టెస్టుల్లో 25, 30 పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం రోజుకు 4 వేల టెస్టులు చేస్తుంటే సగటున 200 కేసులు నమోదవుతున్నాయి. ప్రతి వంద టెస్టులకు ఐదారుగురికి మా త్రమే పాజిటివ్ వస్తోంది. ఇది జిల్లా వాసులకు ధైర్యాన్ని ఇచ్చే అంశమే !
తగ్గిన నమూనాల సేకరణ
జూలై మొదలు అక్టోబరు వరకూ ప్రతిరోజూ 6,7 వేల శాంపిల్స్ సేకరి స్తున్న అధికారులు ప్రస్తుతం శాంపి ల్స్ సేకరణను భారీగా తగ్గించారు. గత పది రోజుల్లో ఐదు రోజులు మాత్రమే ఐదు వేల చొప్పున నమూనాలు సేకరించారు. నవంబరు1, 8, 14, 15 తేదీల లో 11 నుంచి 15 వందలలోపు మాత్రమే నమూనాలు తీసుకున్నారు. శాంపిల్స్ తగ్గించలేదని ప్రజలే టెస్టుల పట్ల ఆసక్తి చూపడం లేదని అధికా రులు చెబుతున్నారు.
మరో 131 కేసులు
8 మొత్తం 97,457
జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుదల కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 131 కేసులు నమోదయాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 97,457కి చేరింది. ప్రస్తుతం 1,319 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. చలి వాతావరణం, పొగమంచు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని వైద్యా ధికారులు సూచిస్తున్నారు.
నమూనాలు, కేసుల వివరాలు..
నవంబరు నమూనాలు కేసులు
1 1,527 426
8 1,258 243
10 5,808 227
11 5,438 239
12 5,724 188
13 5,187 249
14 1,417 154
15 1,107 216
16 5,167 247
17 5,265 220
18 4,312 227
19 3,408 131