-
-
Home » Andhra Pradesh » West Godavari » carona
-
వీరంపాలెంలో పౌర్ణమి వేడుకలు రద్దు
ABN , First Publish Date - 2020-11-28T04:54:03+05:30 IST
ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా వీరంపాలెంలో నిర్వహించే వేడుకలు ఈ సారి కరోనా కారణ ంగా రద్దు చేస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకట రమణ సిద్ధాంతి శుక్రవారం తెలిపారు.

తాడేపల్లిగూడెంరూరల్, నవంబరు 27 : ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా వీరంపాలెంలో నిర్వహించే వేడుకలు ఈ సారి కరోనా కారణ ంగా రద్దు చేస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకట రమణ సిద్ధాంతి శుక్రవారం తెలిపారు.భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న ందున ఉత్సవాలను క్షేత్రంలో రద్దుచేస్తున్నట్టు పేర్కొన్నారు.సుదూర ప్రాం తాల నుంచి వచ్చే భక్తులు గమనించాలన్నారు. ఆలయంలో యధావిధిగా అర్చక స్వాము లచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.