154 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-11-16T05:19:22+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి తగ్గు ముఖం పట్టింది.

154 పాజిటివ్‌ కేసులు

ఏలూరు ఎడ్యుకేషన్‌/ పోడూరు,నవంబరు 15 : జిల్లాలో కరోనా ఉధృతి తగ్గు ముఖం పట్టింది. ఆదివారం కొత్తగా 154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 96,862కి చేరింది. కరోనా తీవ్రతతో ఒకరు మృతి చెందారు. పోడూరు పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శనివారం రాత్రి కరోనాతో  మృతిచెందారు. ఆయనకు గత నెల 29న కరోనా సోకడంతో ఏలూరు ప్రభుత్వా సుపత్రిలో జాయినయ్యారు. చికిత్సపొందుతూ శనివారం మృతిచెందారు.    ఉండ్రా జవరానికి చెందిన ఆయన నాలుగేళ్లగా పోడూరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టే బుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.హెడ్‌ కానిస్టేబుల్‌ మృతికి సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ బి.సురేంద్రకుమార్‌, పోలీసులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-11-16T05:19:22+05:30 IST