కరోనా కన్నెర్ర

ABN , First Publish Date - 2020-11-07T06:01:07+05:30 IST

పాఠశాలల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా యి.

కరోనా కన్నెర్ర

పది మంది టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌/రూరల్‌, నవంబరు 6 : పాఠశాలల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా యి. శుక్రవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా ఒక హెచ్‌ఎంతోపాటు తొమ్మిది మంది టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాఠశాలలకు ఆయా ప్రాం తాల నుంచి విద్యార్థులు, టీచర్లు, ప్రజా రవాణా వాహనాలు, ఆటోల్లో రాకపోకలు సాగిస్తుండడం, తరగతి గదుల బయట విద్యార్థులు గుమి గూడి ఉండడాన్ని నిరోధించే అవకా శాలు లేకపోవడం తదితర కారణాలే విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తికి దారి తీస్తుందని విశ్లేషిస్తున్నారు. శుక్రవా రం వచ్చిన ఫలితాలన్నీ ఆయా పాఠ శాలలు తెరచిన తరువాత చేసిన కరో నా టెస్ట్‌లకు సంబంధించినవని చెబుతుండగా, విద్యా శాఖ దీనిని ఖండిస్తోంది. ఇప్పుడు వెల్లడ వుతున్న కేసులన్నీ పాఠశాలలు తెరవక ముందు చేసినవని వివరణ ఇస్తున్నారు. ఇక ఆ ఫలితాలు వెల్లడి కావడానికి ఏడు నుంచి పది రోజుల వ్యవధి పడుతోందని విద్యా శాఖ అంటుండగా, ఈ లోగా తరగతులకు హాజరైన విద్యార్థు లు, టీచర్లకు పాజిటివ్‌ సోకిన విషయం తెలుసుకునే అవకాశం లేకపోవడం, ఆ మేరకు అటు కుటుంబ సభ్యులు, ఇతరులతోనూ, ఇటు తరగతుల్లో తోటి విద్యార్థు లతోనూ కలిసి ఉండడం వల్ల కరోనా వ్యాప్తికి కారణమవుతోందని భావిస్తున్నారు. 


ఆన్‌లైన్‌ తరగతులకు ఫ్యాప్టో డిమాండ్‌ 

పాఠశాలలు తెరిచాక పెద్ద సంఖ్యలో టీచర్లు, విద్యార్థులు కరోనా బారిన పడుతు న్న దృష్ట్యా ఆన్‌లైన్‌ తరగతులను ఉపాధ్యాయులు ఇళ్ళ వద్ద నుంచి నిర్వహించేలా అనుమతించాలని ఎపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. బడులు తెరచే వరకూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లు, రోజువిడిచి రోజు హాజరయ్యేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో లేఖ పంపించారు. 


95 వేలు దాటేశాయ్‌

ఏలూరు, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి):జిల్లాలో శుక్రవారం కొత్తగా 261 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావ డంతో మొత్తం ఈ సంఖ్య 95,152కు చేరింది. ఏలూరు 29, పాలకొల్లు 26, తాడేపల్లిగూడెం 22, భీమవరం 21, నర సాపురం 18, యలమంచిలి 11, వీరవా సరం 10, కొవ్వూరు 8, జంగారెడ్డిగూడెం 8 కేసులు చొప్పున వెలుగు చూశాయి. కరోనా కారణంగా ఒకరు మరణించడం తో మృతుల సంఖ్య 502కు చేరింది.

Updated Date - 2020-11-07T06:01:07+05:30 IST