-
-
Home » Andhra Pradesh » West Godavari » car
-
కారులో పిల్లలను వదిలి దర్శనానికి.. తిరిగి వచ్చేసరికి..
ABN , First Publish Date - 2020-12-10T06:33:12+05:30 IST
ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో పెద్ద ప్రమాదమే తప్పింది..

ఊపిరాడక స్పృహతప్పిన బాలుడు
అద్దాలు పగులగొట్టి కాపాడిన హోంగార్డు
చిన వెంకన్న సన్నిధిలో సంఘటన..
ద్వారకా తిరుమల, డిసెంబరు 9: ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో పెద్ద ప్రమాదమే తప్పింది.. కారులో చిక్కుకుని ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు చిన్నా రులు హోంగార్డు చొరవతో బయటపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి గ్రామానికి చెందిన అనిల్ కుమార్, మౌనిక దంపతులు తమ పిల్లలు కుషాల్ (5), రామకృష్ణ (3)లతో కలిసి ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బుధవారం వచ్చారు. మొ క్కుబడులు తీర్చుకున్న అనంతరం స్వామివారి దర్శనానికి వెళుతుండగా కరోనా నేపథ్యంలో పదేళ్లలోపు చిన్నారులకు దర్శనం అనుమతి లేదని చెప్పడంతో వారిని కారులోనే కూర్చోబెట్టి లాక్ చేసుకుని దర్శనానికి వెళ్లారు. కారులో ఉన్న కుషాల్ ఊపిరాడక స్పృహతప్పి పడిపోవడంతో చిన్న కుమారుడు రామకృష్ణ అద్దాలను గట్టిగా కొట్టడంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు నర్సింహ యాదవ్ చూశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కారు అద్దాలను పగలకొట్టి ఇద్దరు చిన్నారులను దేవస్థానం ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. మైకులో ఈ సమా చారం తెలపడంతో తల్లితండ్రులు అక్కడకు చేరుకుని తమ పిల్లలను చూసి బోరుమన్నారు. సకాలంలో తమ బిడ్డలను ప్రాణాపాయం నుంచి రక్షించిన హోంగార్డుకు, సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ నారా యణ్ నాయక్ హోంగార్డుకు రివార్డు ప్రకటించారు.