జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కేన్సర్‌ వైద్య సేవలు

ABN , First Publish Date - 2020-03-13T11:20:38+05:30 IST

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్యంతో పెదకాకాని అమెరికన్‌ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కేన్సర్‌ వైద్య సేవలు

ఏలూరు క్రైం, మార్చి 12 : ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్యంతో పెదకాకాని అమెరికన్‌ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో కేన్సర్‌ వైద్యసేవలను గురు వారం ప్రారంభించారు. ప్రతీ గురువారం కేన్సర్‌ బాధితులకు సేవలందిస్తామని డీసీహెచ్‌ఎస్‌ శంకర్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రిలో కేన్సర్‌ రోగులకు అవుట్‌పేషెంట్‌ వైద్య విభాగం లేదని, ప్రతీ గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు.


కేన్సర్‌ గుర్తిస్తే ఆరోగ్యశ్రీ పథకంలో ఉచి తంగా వైద్యసేవలు అందించడం జరుగుతుందని, ఓపీ విభాగా నికి కూడా రుసుం లేదని, పూర్తిగా ఉచిత సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.రవికుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో కేన్సర్‌ బాధిత రోగులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అమెరికన్‌ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ ఎం.సుబ్బా రావు మాట్లాడుతూ తమ సంస్థకు విజయవాడ, గుంటూరు, పెదకాకానిలో మూడు కేన్సర్‌ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కేన్సర్‌ రోగులకు వైద్యసేవలు అందించడానికి చర్యలు చేపట్టామ న్నారు.


ప్రతీ గురువారం ప్రత్యేక వైద్య నిపుణులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కేన్సర్‌ రోగులను గుర్తించి, వారి వ్యాధి స్థాయిని బట్టి ఎలాంటి వైద్యం చేయాలో వివరించి తెలిపి, అర్హత కలిగినవారికి ఆరోగ్యశ్రీ పథకంలో ఉచిత వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ యోగేంద్రబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T11:20:38+05:30 IST