పంచారామాలకు ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2020-11-14T05:03:03+05:30 IST

కార్తీక మాసం సందర్భంగా జిల్లా ప్రజా రవాణా శాఖ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది.

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

రేపటి నుంచి  జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలో సర్వీసులు

ఏలూరు నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం సందర్భంగా జిల్లా ప్రజా రవాణా శాఖ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. పంచారామ క్షేత్రాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి పంచారామ దర్శిని బస్సులను పీటీడీ నడుపుతోంది. ఒక్క రోజులో పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఈ నెల 15, 22, 29, డిసెంబరు 6, 13 తేదీల్లో సర్వీసులు నడుప నున్నారు. 50 మంది ప్రయాణికులు ఉంటే ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసేందుకు పీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - 2020-11-14T05:03:03+05:30 IST