16 నుంచి విద్యార్థులకు వారధి

ABN , First Publish Date - 2020-03-12T08:39:59+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువు తున్న విద్యార్థులందరికీ ఈ నెల

16 నుంచి విద్యార్థులకు వారధి

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 11 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువు తున్న విద్యార్థులందరికీ ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు వారధి పేరిట  (బ్రిడ్జి కోర్సు) ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు  రాష్ట్ర విద్య, పరిశోధనా, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.


వీడియో కాన్ఫరెన్సులో బుధవారం జిల్లాల వారీగా  బ్రిడ్జి కోర్సు నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు.ముందుగా ఈ నెల 16న ఉపాధ్యాయులు బాల బాలికలందరికీ ఒక ప్రారంభ పరీక్షను నిర్వహించాలని సూచించారు.ప్రశ్నపత్రం 50 మార్కులకు ఉంటు ందన్నారు. ప్రారంభ పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థులను రెండు జట్లుగా విభజించి బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ పాండురంగ స్వామి, డీఈవో సీవీ రేణుక, డీసీఈబి కార్యదర్శి వడ్లపట్ల మురళీకృష్ణ, ఏఎంవో జాన్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T08:39:59+05:30 IST