రాజస్థాన్‌ నుంచి తిరిగొచ్చిన బ్రహ్మకుమారిలు

ABN , First Publish Date - 2020-05-10T09:03:55+05:30 IST

జిల్లాకు చెందిన బ్రహ్మకుమారిలు ఎట్టకేలకు చేరుకున్నారని ఏలూరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వాహకులు బికె లావణ్య తెలిపారు.

రాజస్థాన్‌ నుంచి తిరిగొచ్చిన బ్రహ్మకుమారిలు

ఏలూరు కల్చరల్‌, మే 9 : జిల్లాకు చెందిన బ్రహ్మకుమారిలు ఎట్టకేలకు చేరుకున్నారని ఏలూరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వాహకులు బికె లావణ్య తెలిపారు. ఏలూరులోని బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు నెలల కిందట జిల్లా నుంచి 120 మంది రాజస్థాన్‌లోని మౌంట్‌అబూ సందర్శన, జ్ఞానశిక్షణ, సేవల కోసం తరలివెళ్లారు. లాక్‌డౌన్‌తో 55 రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అను మతి ఇవ్వడంతో వీరంతా ప్రత్యేక రైల్లో బయలు దేరి విశాఖకు 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులో రాజమహేంద్రవరం అక్కడ నుంచి తాడేపల్లిగూడెం చేరుకున్నారు. వీరిలో ఏలూరుకు చెందిన 18 మంది ఉన్నారు. వీరిని క్వారంటైన్‌కు తరలించి కొవిడ్‌ - 19 స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించి ఒక ప్రత్యేక బ్లాక్‌లో ఉంచారని లావణ్య తెలిపారు. 

Updated Date - 2020-05-10T09:03:55+05:30 IST