బీపీఎస్ మరో నెల పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-01T05:48:34+05:30 IST
మున్సిపాలిటీలలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీము (బీపీఎస్) మరో నెలరోజులు పాటు పొడిగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి.

భీమవరం, నవంబరు 30: మున్సిపాలిటీలలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీము (బీపీఎస్) మరో నెలరోజులు పాటు పొడిగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. జీవో నెం.551 ప్రకారం నెలాఖరుకు పొడిగించారు. గతంలో పెంచిన గడువు సోమవారంతో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం నుంచి కరోనా కారణంగా తమ భవనాలను రెగ్యులైజేషన్ చేయించుకునే వినియోగదారులు ఆలస్యం చేయవల్సి వచ్చింది. దీనికి తోడు పురపాలక సంఘాల్లో కూడా ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అవరోధంగా మారడం కూడా మరో ముఖ్య కారణంగా ఈ పథకానికి ఆశించిన స్థాయిలో ధరఖాస్తులు వచ్చినప్పటికీ పనులు పూర్తికాలేదు. అన్ని మున్సిపాలిటీలలోను వివిధ కారణాలు, అసంపూర్తి దరఖాస్తులు, ఇబ్బందులు కూడా కనిపించడంతో డీటీసీపీ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం మున్సిపల్ పరిపాలన విభాగం ఈ పథకాన్ని పొడిగించింది.
నవంబరు 30వ తేదీ నాటికి జిల్లాలో దరఖాస్తులు
దరఖాస్తులు తిరస్కరణ తప్పులు పెండింగ్ అనుమతి
భీమవరం 473 16 40 13 397
ఏలూరు 365 3 10 12 340
కొవ్వూరు 103 4 17 1 81
నరసాపురం 290 5 0 0 285
నిడదవోలు 67 5 0 0 62
పాలకొల్లు 230 1 0 0 227
జంగారెడ్డిగూడెం 206 5 0 2 199
తాడేపల్లిగూడెం 377 4 20 13 331