కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : గాంధీ

ABN , First Publish Date - 2020-11-27T05:07:25+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పఽథకాలను కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ అన్నారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : గాంధీ
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ

తణుకు, నవంబరు 26 : కేంద్ర ప్రభుత్వ పఽథకాలను కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ అన్నారు. రోటరీ క్లబ్‌లో బీజేపీ ఆరు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులకు గురువారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. ఆరు జిల్లాల శిక్షణ తరగతుల ఇన్‌ఛార్జి కోడూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ ప్రజోపయోగకరమైన పఽథకాలను ఎన్నో తెచ్చారన్నారు.నాయకులు పాకా సత్యనారాయణ,నరసాపురం పార్లమెంట్‌ బీజేపీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీదేవి,కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:07:25+05:30 IST