-
-
Home » Andhra Pradesh » West Godavari » bhimavarma mavullamma temple
-
ముగిసిన మావుళ్లమ్మ దీక్షలు
ABN , First Publish Date - 2020-12-11T04:50:20+05:30 IST
మావుళ్లమ్మ దీక్ష చేపట్టిన భక్తులు గురువారం విరమణ చేశారు.

భీమవరం టౌన్, డిసెంబరు 10: మావుళ్లమ్మ దీక్ష చేపట్టిన భక్తులు గురువారం విరమణ చేశారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు అనంతరం వారికి ఆలయ అర్చకులు ఇరుముడులను కట్టారు. ప్రత్యేక హో మాలను నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు. ఆలయ సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాద్ హోమ ద్రవ్యాలను హోమగుండంలో వేయించారు. దీక్షాధారులు కూడా తెచ్చుకున్న హోమ ద్రవ్యాలను హోమగుండంలో వేసి అమ్మవారికి ఇరుముడులను సమర్పించి దీక్షలను విరమించారు.
