సోమేశ్వరస్వామికి లక్షపత్రి పూజ

ABN , First Publish Date - 2020-12-31T04:43:47+05:30 IST

శివ ముక్కోటి, ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని బుధవారం పంచారామ క్షేత్రం గునుపూడిలోని సోమేశ్వర స్వామికి లక్షపత్రి పూజ, విశేష అలంకారం చేశారు.

సోమేశ్వరస్వామికి లక్షపత్రి పూజ

భీమవరం టౌన్‌, డిసెంబరు 30: శివ ముక్కోటి, ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని బుధవారం పంచారామ క్షేత్రం గునుపూడిలోని సోమేశ్వర స్వామికి లక్షపత్రి పూజ, విశేష అలంకారం చేశారు. గునుపూడికి చెందిన చెరుకుపల్లి మురళీకృష్ణ, కృష్ణవేణి దంపతుల సౌజన్యంతో పూజలు నిర్వ హించారు. ఆలయ అర్చకులు కందుకూరి సోంబా బు, చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మారేడు బిల్వలతో లక్షపత్రిపూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించి పూలతో విశేష అలంకారం చేశారు. ఆలయ ఈవో అరుణ్‌కుమార్‌ పర్యవేక్షించారు.

Updated Date - 2020-12-31T04:43:47+05:30 IST